- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కరోజులో పెళ్లి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పెళ్లి చేసుకుని జీవితాన్ని భార్యతో ఆనందంగా గడపాల్సిన యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చేసుకుని జీవితాన్ని భార్యతో ఆనందంగా గడపాల్సిన యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడ్రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అతను తీసుకున్న నిర్ణయం ఇరు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన చేవూరి ప్రతాప్ గౌడ్ (31)కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 13వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతాప్ వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తుంటాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇతనే చిన్నవాడు.
పెళ్లి ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఇంటిలో పోచమ్మ పండుగ చేయాలని నిర్ణయించారు. ఇంతలో ఇంట్లో బంధువులు ఏదో అన్నారని మనస్తాపానికి గురైన ప్రతాప్.. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో అతనికోసం వెతకగా.. గుట్టపై బైక్ కనిపించింది. ఆ దిశగా వెతకగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు ప్రతాప్. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన కొడుకు.. ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.






