- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్రమైన అనారోగ్యం.. జీవితం పట్ల విరక్తి.. వ్యక్తి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన జంగం మల్లేష్ (45) అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, వెల్గటూర్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన జంగం మల్లేష్ (45) అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మల్లేష్‌కు మూడు సంవత్సరాల క్రితం భగీంద్రం వ్యాధి సోకింది. అప్పటి నుంచి నాలుగు సార్లు శస్త్రచికిత్సలు జరిపినప్పటికీ వ్యాధి నుంచి విముక్తి లభించలేదు.
వ్యాధితో తీవ్రంగా నలిగిన మల్లేష్ ఈ నెల 17వ తేదీన “మూత్రవిసర్జనకు వెళ్తున్నానంటూ” ఇంటి నుంచి బయటకు వెళ్లి తన వెంట తీసుకెళ్లిన గడ్డి మందును తాగాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మల్లేష్ ఆరు రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుడి భార్య గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.






