- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
దిశ, జడ్చర్ల : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న జడ్చర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు(38). ఇతను ఇటీవలే నూతనంగా

దిశ, జడ్చర్ల : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న జడ్చర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు(38). ఇతను ఇటీవలే నూతనంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. అలాగే పిల్లల చదువు కొరకు అప్పులు చేశాడు. దీంతో ఆ అప్పులను ఎలా తీర్చాలని మానసిక వేదనకు గురై జడ్చర్ల మండల పరిధిలోని చర్లపల్లి గ్రామశివారులో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న భార్య కళావతితో నిత్యం ఇంటి నిర్మాణానికి, పిల్లల చదువులకై చేసిన అప్పులు ఎలా తీర్చాలని.. వాటికి వడ్డీ చెల్లించలేకపోతున్నానని చెప్పుకొని బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఈ విషయం తనతో చెప్పి బాధపడ్డాడని.. ఉదయం నిద్రలేచి చూసే వరకు ఇంట్లో లేడని.. చుట్టూ పక్కల వెతికినా కనిపించలేదని తెలిపారు. ఆఫీస్ టైమ్ కావడంతో విధులకు వెళ్లానని.. ఇంతలోనే తన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందిందని భార్య కళావతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరూ కూతుర్లు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు జడ్చర్ల ఎస్సై జయప్రసాద్ తెలిపారు.






