- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య..
ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా క్రుంగి, జీవితం మీద విరక్తిచెంది గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నస్పూర్ లో చోటుచేసుకుంది.

దిశ, నస్పూర్ : ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా క్రుంగి, జీవితం మీద విరక్తిచెంది గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నస్పూర్ లో చోటుచేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన సురమిల్ల జీవన్ (35) సెంట్రింగ్ కూలీ చేస్తూ భార్య, కూతురుతో కలిసి సీతారాంపల్లిలో నివసిస్తున్నాడు. గత కొంతకాలం నుండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కూతురు చదువు, భవిష్యత్తు గురించి దిగులుపడుతూ మానసికంగా కృంగిపోయాడు.
ఈ క్రమంలో 20-03-2023 నాడు తన ఫోన్ ఇంట్లో పెట్టి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. జీవన్ కనిపించట్లేదని 21-03-2023 నాడు భార్య అనూష ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసునమోదు చేశారు. బుధవారం ఉదయం సీతారాంపల్లి శివారులోని గోదావరి నదిలో వ్యక్తి మృతిచెంది ఉండగా గ్రామజాలర్లు చూసి సమాచారం ఇచ్చారు. జీవన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మానసికంగా కృంగి, జీవితం మీద విరక్తి చెంది గోదావరినదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.






