నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా ఇంకా ఒంటరే.. వదిన వల్ల ట్యాంక్ ఎక్కిన మరిది!

by Gantepaka Srikanth |

కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరిన వేళ ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడిన ఘటన కలకలం రేపింది.

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా ఇంకా ఒంటరే.. వదిన వల్ల ట్యాంక్ ఎక్కిన మరిది!
X

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరిన వేళ ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడిన ఘటన కలకలం రేపింది. మూడో భార్య తరపు బంధువుల వేధింపులు, దూషణలు భరించలేక సదరు భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ వింత ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాధిత వ్యక్తికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. విభేదాల కారణంగా వారితో విడిపోయి(విడాకులు తీసుకొని) దూరంగా ఉంటున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా మూడో భార్యతో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తరపు బంధువులు జోక్యం చేసుకోవడంతో గొడవ మరింత ముదిరింది.

అక్క తిట్టిందని మనస్తాపం

తాజా సమాచారం ప్రకారం, మూడో భార్య అక్క (వదిన) సదరు వ్యక్తిని బహిరంగంగా తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తనను తిట్టిన వదిన స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. మూడు గంటల పాటు అందరినీ చుక్కలు చూపించాడు. చివరకు డీఎస్పీ శ్రీనివాసులు జోక్యం చేసుకుని, సదరు మహిళతో క్షమాపణ చెప్పిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత వ్యక్తి అశోక్ కిందికి దిగారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story