- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జామకాయ కోసం జంతువులా మారిన వైనం: చిన్నారిపై అత్యంత కిరాతకంగా దాడి!
మానవత్వం మంటగలిసింది. కల్మషం లేని చిన్నారి చిరునవ్వు ముందు ఒక జామకాయ విలువ ఎక్కువైపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: మానవత్వం మంటగలిసింది. కల్మషం లేని చిన్నారి చిరునవ్వు ముందు ఒక జామకాయ విలువ ఎక్కువైపోయింది. కేవలం తన పెరట్లోని జామకాయ కోసిందన్న కక్షతో, ఒక వ్యక్తి పసిపాప అని కూడా చూడకుండా ప్రదర్శించిన పైశాచికత్వం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి.. తన పెరట్లోని జామ చెట్టు నుంచి కాయలు కోసిందని ఒక చిన్నారిపై విరుచుకుపడ్డాడు. ఆ పసిపాపను పట్టుకుని, తప్పించుకోకుండా చేతులు వెనక్కి విరిచి ఒక స్తంభానికి గట్టిగా కట్టేశాడు. భయంతో వణికిపోతూ, కన్నీళ్లతో తనను వదిలేయమని వేడుకున్నా ఆ పాపపై కనికరం చూపలేదు. అంతటితో ఆగకుండా, అత్యంత అసహ్యకరంగా ఆ చిన్నారి ముఖమంతా కోడి విసర్జితాన్ని (కోడి పెంట) పూసి వికృతానందం పొందాడు.
అడ్డుకోబోతే ఎదురుదాడి..
ఈ అమానుషాన్ని చూసి చుట్టుపక్కల వారు, బాటసారులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా వారిపై కూడా ఎదురుదాడికి దిగాడు. "నా చెట్టు కాయలు కోస్తే మీకేంటి?" అంటూ నిస్సిగ్గుగా వాదించి తన పైశాచికత్వాన్ని సమర్థించుకున్నాడు. "ఒక జామకాయ విలువ ఆ పసిపాప ఆత్మగౌరవం కంటే ఎక్కువైందా?" అని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పసిపాపపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అధికారులు వెల్లడించారు.






