- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమాయకులే టార్గెట్.. డబ్బులు డ్రా చేస్తానని బురిడీ..
ఏటీఎం సెంటర్స్ వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే అమాయకులను, వృద్ధులను మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.

దిశ, హుజూర్ నగర్ : ఏటీఎం సెంటర్స్ వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే అమాయకులను, వృద్ధులను మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని కృష్ణ లంకకు చెందిన చింతల సురేష్ బాబు గత కొంతకాలంగా ఏటీఎం సెంటర్ల వద్ద డబ్బులు డ్రా చేసే అమాయకులైన వ్యక్తులను టార్గెట్ చేసే పనిలో ఉన్నాడని తెలిపారు.
ఏటీఎం సెంటర్ కి వచ్చే వారి నుండి డబ్బులు డ్రా చేస్తానని ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నెంబర్ తెలుసుకోని అందులోని డబ్బులను డ్రా చేసి ఆ తర్వాత అసలైన ఏటీఎం కార్డును తన వద్ద ఉంచుకొని ఫేక్ ఏటీఎం కార్డు వారికి ఇచ్చి పిన్ నెంబర్ను గుర్తుపెట్టుకుని తర్వాత అతను ఆ ఏటీఎం మరోచోట ఉపయోగించి డ్రా చేస్తున్నాడని తెలిపారు. గత నవంబర్ 19న హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మంద విజయ కరుణ హుజూర్ నగర్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ వద్ద డబ్బులు తీసి ఇస్తానని చెప్పి డబ్బులు డ్రా చేసి ఫేక్ ఏటీఎం ఆమెకిచ్చి అసలైన ఏటీఎం కార్డు తన వద్ద ఉంచుకొని దాని ద్వారా రూ .1-25 లక్ష డ్రా చేసాడని ఇది గుర్తించిన ఆమె తను మోసపోయానని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తెలిపారు.
బాధితురాలు ఇచ్చిన పిటిషన్ పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు సురేష్ బాబు బుధవారం మద్యాహ్నం 12.00 గంటల సమయంలో హుజూర్ నగర్ లోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తీసుకువచ్చి విచారణ చేయగా తన పూర్తి వివరాలను వెల్లడించి తను చేసిన నేరాలను ఒప్పుకున్నాడని తెలిపారు . నిందితుడుపై ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 44 కేసులు ఉన్నాయని చెప్పారు. నేరస్తుని నుండి 1లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్సై బలరాం రెడ్డి కానిస్టేబుల్ వరప్రసాద్ నాగరాజు ఉన్నారు.






