- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ భూతానికి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి బలి
బెట్టింగ్ భూతానికి చిక్కి ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ,దుండిగల్ : బెట్టింగ్ భూతానికి చిక్కి ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన తోటపల్లి తిరుపతి కుమారుడు తోటపల్లి శ్రీకాంత్ మైసమ్మగూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతూ బహదూరపల్లి ఇందిరమ్మ కాలనీ లో ఉంటున్నాడు. బెట్టింగ్ కు అలవాటుపడ్డ అతను జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి దగ్గర రూ. 34 వేలు అప్పు చేసాడు. వడ్డీ ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మూడు నెలల క్రితం రూ.10 వేలు పంపాలంటూ కుటుంబ సభ్యులను అడగడంతో కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు సమాచారం.
అప్పు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయడంతో పాటు అతని దగ్గర ఉన్న ల్యాప్ టాప్,మొబైల్ ఫోన్ ను తీసుకువెళ్లడం తో మనస్తాపానికి గురైన అతను ఈ నెల 14న ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సతీష్ తెలిపాడు.






