- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రక్కుకు పెను ప్రమాదం..ఏకంగా 30 మంది మృతి
నైజీరియా దేశంలో రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుందట.

దిశ, వెబ్ డెస్క్: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 30 మంది మరణించారు. ఈ సంఘటన నైజీరియాలోని కానోలో తాజాగా చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాలోని కానో లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కుకు పెను ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏకంగా అందులో ప్రయాణిస్తున్న 30 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు అక్కడి అధికారులు.
ఇక ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి వెంటనే తరలించారు. అటు నైజీరియా దేశంలో రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుందట. దీంతో ఈ రోడ్డును సరిగ్గా చేయాలని ఈ డిమాండ్ చేస్తున్నారు జనాలు. అటు ప్రమాదం చేసిన ట్రక్ డ్రైవర్ ఆచూకీ ఇంకా తెలియ రాలేదని సమాచారం. అందులోనే చనిపోయాడా? లేక పారిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటన ఎప్పుడు హాట్ టాపిక్ అయింది.






