- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం!
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరం రేకెత్తిస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరం రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాతబస్తీ-శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున అలీనగర్, కాలాపత్తర్ వద్ద ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ (Plastic Scrap Godown)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు ఫైర్ ఇంజన్‌లతో స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరుగా వేడుకుంటున్నారు.
Next Story






