బార్ అండ్ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల రూపాయల ఆస్తి నష్టం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 05:30:27  IST  )

బార్ అండ్ రెస్టారెంట్‌‌లో భారీ అగ్ని ప్రమాదం చోటచేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

బార్ అండ్ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల రూపాయల ఆస్తి నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్/మరిపెడ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కేంద్రంలోని సెవెన్ హిల్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో పొగలు రావడంతో అటుగా వచ్చిన వాకర్స్, రైతులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 గంట పాటు తీవ్రంగా శ్రమించి మంటలార్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు, సుమారు రూ.40 లక్షల ఆస్తి, లిక్కర్ నష్టం వాటిల్లినట్లు బార్ యజమాని దుబ్బాక నరేష్‌రెడ్డి వెల్లడించారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో కౌంటర్‌లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, కొంత నగదు మంటల్లో కాలిపోయినట్లుగా ఆయన తెలిపారు.

Next Story