- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
సత్యనారాయణ స్వామి సన్నిథి కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సత్యనారాయణ స్వామి సన్నిథి కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రత్నగిరి (Ratnagiri)పై పడమటి రాజగోపురం సమీపంలో ఉన్న దుకాణ సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన షాపు నిర్వాహకులు, ఆలయ సెక్యూరిటీ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు స్పాట్ చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం ఐదు దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా సమాచారం. అయితే, ఈ ప్రమాదానికి షాట్ సర్క్యూటేనని ఆలయ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Next Story






