- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ప్యాట్నీ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. సికింద్రాబాద్(Secunderabad)లోని ప్యాట్నీ సెంటర్(Patni Center)లో ఆదివారం సాయంత్రం అనూహ్యంగా మంటలు చెలరేగాయి. SBI బ్యాంకు ఉన్న భవనంలోని నాలుగో అంతస్థులో మంటలు అలుముకున్నాయి. గమనించిన స్థానికులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఇటీవలే హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రావి నారాయణ రెడ్డి నగర్‌లో పేదల గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా సుమారుగా 400 గుడిసెలు తగలబడిపోయాయి.






