ఫోన్ ట్యాపింగ్ దేశ చరిత్రలో అమానుష చర్య.. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ దేశ చరిత్రలో అమానుష చర్య.. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహా న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని అన్నారు. ఛానల్‌పై గుండాలు, రౌడీల్లా దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నేతల పన్నాగం పన్నారు. రాజకీయ నాయకులు సినీతారలు, జడ్జీలు, మహిళా ఐఏఎస్ అధికారులు, చివరకు సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్‌లు చేయడం అనేది దేశ చరిత్రలో అమానుష చర్య. రాజకీయ నేతల అడుగులకు మడుగులు ఒత్తే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావును వెసులుబాటు కోసం ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత స్వేచ్చను హరించే హక్కు ఎవరిచ్చారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కి బాధ్యులు ప్రభాకర్, రాధాక్రిష్ణ మాత్రమే కాదు.. అప్పటి సీఎం, మంత్రివర్గం, అధికారులు, డీజీపీ, లీగల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, హోంసెక్రటరీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Next Story