- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డార్క్ వెబ్ లింకులతో అమెరికన్లకు వల! వెబ్ సిరీస్ చూసి యువకుల క్రైమ్ ప్లాన్
వెబ్ సిరీస్ క్రైమ్ ఐడియాతో అమెరికన్లను ముంచేస్తున్న కేటుగాళ్లను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్లను చూసి.. అమెరికా పౌరుల అకౌంట్లను ఖాళీ చేస్తున్న ఓ నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ గుట్టును గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. వడోదరలోని అకోటా (Akota) ప్రాంతంలో ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ ఆన్‌లైన్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌పై లోకల్ క్రైమ్ బ్రాంచ్ (LCB) జోన్-2 పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ కేసులో కరణ్ లోక్వానీ, జోనాథన్ దాస్, పంకజ్ జెత్వాని, అలెరసూల్ సయ్యద్ అనే నలుగురు విద్యావంతులైన నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రొఫెషనల్ ఇంగ్లీష్‌లో మాట్లాడి.. బురిడీ
పోలీసులు కథనం మేరకు.. ఈ కేటుగాళ్లు మొదట డార్క్ వెబ్ (Dark Web) ద్వారా అమెరికాకు చెందిన వేలాది మంది పౌరుల వ్యక్తిగత వివరాలను, ఫోన్ నంబర్లను సేకరించారు. ఆ తర్వాత విదేశీయులకు ఫోన్ చేసి, తాము అమెరికాకు చెందిన సిటీ క్రెడిట్స్ City Credits) అనే ఆర్థిక సంస్థ నుంచి లోన్ ఏజెంట్లుగా మాట్లాడుతున్నామని నమ్మించే వారు. మీకు తక్కువ వడ్డీకే లోన్ అప్రూవ్ అయిందంటూ ప్రొఫెషనల్ ఇంగ్లీష్‌లో నాన్‌స్టాప్‌గా మాట్లాడి బురిడీ కొట్టించేవారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, టాక్స్ పేరిట ఒక్కొక్కరి నుంచి 150 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు డిమాండ్ చేసేవారు. బాధితులు వీరి మాటలు నమ్మి ఫీజులు చెల్లించడానికి సిద్ధపడగానే.. వారి డెబిట్ కార్డ్ నంబర్లు, ఎక్స్‌పైరీ డేట్లు, సీవీవీ (CVV) కోడ్‌లను నిందితులు తస్కరించేవారు. అలా అమెరికా పౌరుల ఖాతాల నుంచి దొంగిలించిన డబ్బును మొదట క్రిప్టోకరెన్సీ (Crypto Currency)గా మార్చేవారు. ఆ తర్వాత వాటిని భారతీయ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు.
రూ.35 లక్షల ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ సీజ్..
అయితే, ముఠాలోని నిందితులంతా పై చదువులు చదివారని, అందులో ఒకరు స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి 8 హై-ఎండ్ ల్యాప్‌టాప్‌లు, 7 స్మార్ట్‌ఫోన్లు, రూటర్లు, లిక్విడ్ క్యాష్ కలిపి మొత్తం రూ. 35 లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ సైబర్ మోసంలో వెస్ట్ బెంగాల్‌తో పాటు దేశంలోని మరికొన్ని నకిలీ కాల్ సెంటర్లతో వీరికి ఉన్న లింకులపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు.






