- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిజ్జా షాపులో వేధింపులు.. భవనం పైనుంచి దూకేసిన ప్రేమికులు
పిజ్జా షాపులో సరదాగా సమయం గడుపుతున్న ప్రేమికులను.. మోరల్ పోలీసింగ్ పేరుతో హిందూ సంస్థకు చెందిన సభ్యులు చుట్టుముట్టి వేధించడంతో భయంతో భవనం రెండో అంతస్తు నుంచి దూకేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పిజ్జా షాపులో సరదాగా సమయం గడుపుతున్న ప్రేమికులను.. మోరల్ పోలీసింగ్ పేరుతో హిందూ సంస్థకు చెందిన సభ్యులు చుట్టుముట్టి వేధించగా.. భయంతో భవనం రెండో అంతస్తు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ పూర్లో వెలుగుచూసింది. బాధితులు ఓ పిజ్జాషాపులో రెండో అంతస్తులో కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ఓ హిందూత్వ అనుబంధ సంస్థకు చెందిన కార్యకర్తలు వారిని అడ్డుకుని వరుస ప్రశ్నలతో వేధించారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే ప్రేమికులు.. తమ పరువు పోతుందని భయాందోళనకు గురై.. కిటికీలో నుంచి కిందికి దూకేశారు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ జంట పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రేమికులను వేధించే హక్కు ఎవరికీ లేదని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






