AP: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) తీవ్ర విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో రైలు ( Train) కింద పడి ఓ ప్రేమ జంట (Lovers

AP: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) తీవ్ర విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో రైలు ( Train) కింద పడి ఓ ప్రేమ జంట (Lovers) ఆత్మహత్య చేసుకుంది. ఈ బాపట్ల జిల్లాలో ( Bapatla) చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కడవకుదురు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

మృతులు చిన్నగంజాం మండలం, కొత్తపాలెం కు చెందిన జాహ్నవి , మణికంఠ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. తమ ప్రేమకు పెద్దవాళ్లు అడ్డువస్తున్నారని... గత మూడు నెలలుగా ఆందోళన చెందుతున్నారట ఈ ఇద్దరు ప్రేమికులు. అయితే పెద్దలు తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న ఉద్దేశంతో... జాహ్నవి అలాగే మణికంఠ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.

ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా... ట్రైన్ వచ్చే సమయంలో పట్టాల పైకి దూకేశారు. వాళ్లపై నుంచి ట్రైన్ దూసుకు వెళ్లడంతో... అక్కడికక్కడే మరణించారు. ఇక ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటనలపై.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి... దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story