- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళ్లు చేతులు కట్టేసి, డ్రమ్ములో ముంచేసి.. ఎంపీలో మరో దారుణం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవాస్ జిల్లాలో తన ప్రియురాలు మరొకరితో సంబంధం పెట్టుకుందని ప్రియుడు దారుణంగా హతమార్చాడు. కాళ్లు, చేతులు కట్టేసి నీటితో ఉన్న డ్రమ్ములో ముంచి చంపేశాడు. కొంత కాలంగా లక్షిత చౌదరి 22, మోను అనే యువతి యువకుడు ప్రేమలో ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవాస్ జిల్లాలో తన ప్రియురాలు మరొకరితో సంబంధం పెట్టుకుందని ప్రియుడు దారుణంగా హతమార్చాడు. కాళ్లు, చేతులు కట్టేసి నీటితో ఉన్న డ్రమ్ములో ముంచి చంపేశాడు. కొంత కాలంగా లక్షిత చౌదరి 22, మోను అనే యువతి యువకుడు ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. లక్షిత మరో యువకుడితో సంబంధం పెట్టుకుందని ప్రియుడిలో అనుమానం మొదలైంది.
ఈ క్రమంలోనే లక్షిత కాలేజీకి వెళుతున్నట్టు చెప్పి ప్రియుడి ఇంటికి వెళ్లగా ఇద్దరి మధ్య మరోసారి గొడవల జరిగింది. దాంతో మోను ప్రియురాలి కాళ్లు చేతులు కట్టేసి ఓ డ్రంబులో ముంచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇక గతంలో ఇదే రాష్ట్రంలో భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంగతి తెలిసిందే.






