- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sangareddy : బండ్లగూడలో ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి
సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని బండ్లగూడ(Bandlaguda)లో సోమవారం దారుణ ఘటన జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని బండ్లగూడ(Bandlaguda)లో సోమవారం దారుణ ఘటన జరిగింది. బండ్లగూడలో రమ్య అనే యువతిని ఆమె మాజీ ప్రియుడు ప్రవీణ్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తానూ అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించగా.. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. రామచంద్రం పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. డిగ్రీ చదువుతున్న రమ్య, ప్రవీణ్ గతంలో ప్రేమించుకున్నారు. సోమవారం ఉదయం రమ్య ఇంటికి వచ్చిన ప్రవీణ్ ఆమెతో కొంత సమయం మాట్లాడాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వాగ్వాదం పెద్దది కాడంతో ప్రవీణ్ కత్తితో రమ్యపై దాడి చేశాడు.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం, ప్రవీణ్ కూడా కత్తితో దాడి చేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. రమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామచంద్రం పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.






