- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డు క్రాస్ చేస్తున్న వారిని ఢీకొట్టిన లారీ
రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డు క్రాస్ చేస్తున్న వారిని ఢీకొట్టిన లారీ

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం(Lorry Accident) చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న వారిని అతి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు జిల్లా బళ్లారి చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు.. మృతులు రామిరెడ్డి, లక్ష్మినారాయణ రెడ్డి, శ్రీనుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, కొన్ని గంటల క్రితమే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సు వేగంగా వెళ్తూ అనాసాగరం ఫ్లైఓవర్‌పై లారీని ఓవర్‌టేక్ చేయబోయి బలంగా ఢీ కొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుందని.. ఇందులో మొత్తం 35మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే వరుస ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






