బైక్ ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి మృతి

by Taduka Kalyani |

మృత్యు రూపంలో వచ్చిన లారీ విద్యార్థినిని పొట్టన పెట్టుకుంది. అత్యంత విషాదకరమైన సంఘటన కొండపాక మండలం కొమరవెల్లి కమాన్ సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

బైక్ ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి మృతి
X

దిశ కొండపాక: మృత్యు రూపంలో వచ్చిన లారీ విద్యార్థినిని పొట్టన పెట్టుకుంది. అత్యంత విషాదకరమైన సంఘటన కొండపాక మండలం కొమరవెల్లి కమాన్ సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర రాజు కూతురు శాన్విక కుకునూరు పల్లి మండలం చిన్న కిస్టాపూర్ శివారులో గల విజయలక్ష్మి మెమోరియల్ పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. సెలవులు రావడంతో తండ్రి రాజు కూతుర్ని తీసుకు వెళ్లడానికి వచ్చి మోటార్ సైకిల్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ అతివేగంగా అజాగ్రత్తగా మోటార్ సైకిల్ ను ఢీ కొట్టి కొద్ది దూరం వరకు లాక్కెళ్ళింది. దాంతో శాన్విక అక్కడికక్కడే మృతి చెందగా రాజుకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి వెళ్ళాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేసవి సెలవులు ఇంటికి వెళ్దాం అనుకున్న గ్రామంలో మృత్యుఒడిలోకి వెళ్లడంతో విషాదం నిండింది. కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story