తమిళనాడులో దారుణం.. బాలుడిపై దాడి చేసి చంపిన చిరుత

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాడులో దారుణం చోటు చేసుకుంది. కోయంబ‌త్తూరు జిల్లా వాల్పారైలోని తేయాకు తోట‌లో చిరుత‌పులి ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది.

తమిళనాడులో దారుణం.. బాలుడిపై దాడి చేసి చంపిన చిరుత
X

దిశ, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడులో దారుణం చోటు చేసుకుంది. కోయంబ‌త్తూరు జిల్లా వాల్పారైలోని తేయాకు తోట‌లో చిరుత‌పులి ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వాల్పారైలోని అయ్య‌ర్పాడి తేయాకు ఎస్టేట్ లో అస్సాం వ‌ల‌స కార్మికుడి కుటుంబం ప‌నిచేస్తోంది. కాగా ఆ కుంటుంబంలోని బాలుడు సైఫుల్ శ‌నివారం ఇంటిముందు ఆడుకుంటున్న స‌మ‌యంలో తేయాకు పొదల్లోనుండి వచ్చి ఒక్కసారిగా దాడి చేసింది.

బాలుడిని అక్కడ నుండి లాక్కెళ్లిపోయింది. బాలుడు ఇంటి ముందు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, తోటలో పనిచేసే కార్మికులు గాలింపు మొదలు పెట్టగా ఒకదగ్గర మృత‌దేహాన్ని గుర్తించారు. బాలుడి ఒంటిపై ఉన్న‌గాయాలు, చిరుత ఆన‌వాళ్లు ఉన్నాయి. అట‌వీశాఖ అధికారులు అది చిరుత‌దాడే అని గుర్తించారు. ఇదిలా ఉంటే గ‌త ఎనిమిది నెల‌ల్లో ఈ ప్రాంతంలో చిరుత దాడిలో చిన్నారులు మృతి చెంద‌డం ఇది మూడోసారి కావ‌డం ఆందోళ‌న‌క‌రం. దీంతో స్థానికులు తీవ్ర‌భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Next Story