లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఘాతుకం.. కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-05 05:18:37  IST  )

పంజాబ్‌ (Punjab)లోని లూధియానా (Ludhiana) జిల్లా సమ్రాలా బ్లాక్‌లో దారుణం చోటుచేసుకుంది.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఘాతుకం.. కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌ (Punjab)లోని లూధియానా (Ludhiana) జిల్లా సమ్రాలా బ్లాక్‌లో దారుణం చోటుచేసుకుంది. కబడ్డీ ఆటగాడు గుర్‌విందర్ సింగ్‌ను ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ తుపాకీతో కాల్చి దారుణంగా హతమార్చింది. ఇటీవలి కాలంలో కబడ్డీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన రెండో హత్య ఇది కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాంగ్‌వార్ హింస పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ హత్య తాము చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ‘అన్మోల్ బిష్ణోయ్’ (Anmol Bishnoi) పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో కరణ్ మధ్‌పూర్, తేజ్‌చక్ హత్యలు కూడా తామే చేశామని వెల్లడించారు. గ్యాంగ్ సభ్యులు హ్యారీ బాక్సర్, ఆర్జూ బిష్ణోయ్ బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్పెషల్ సెర్చ్ టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story