విరిగిపడిన కొండచరియలు.. 30కి చేరిన మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-27 02:20:47  IST  )

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.

విరిగిపడిన కొండచరియలు.. 30కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలతో భారీ వరదలు సంభవించాయి. వైష్ణోదేవి ఆలయం వద్ద (Vaishno Devi Yatra) కొండచరియలు వరిగి పడి ఘటనలో మృతుల సంఖ్య 9 నుంచి 30కి పెరిగింది. భారీ వర్షాల నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు మూసివేశారు. ఇంకా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. భక్తులు ఎవరూ దర్శనానికి రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కొండచరియలు విరిగిన ప్రాంతంలో NDRF, లోకల్ పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదేవిధంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక కథువా, సాంబ, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూకశ్మీర్ పరిధిలో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండగా.. చాలా ప్రాంతాల్లో వరద ముప్పు నెలకొంది. ఈ క్రమంలోనే నదీ పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story