నడిరోడ్డుపై టీచర్ హత్య..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-22 05:58:36  IST  )

* రాష్ట్రంలో దారుణ ఘటన... * నడిరోడ్డుపైనే మహిళా ఉపాధ్యాయురాలి హత్య.. * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్... కేసు నమోదు..

నడిరోడ్డుపై టీచర్ హత్య..
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌ ముజఫ్ఫర్‌పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. తొరౌరాకు చెందిన టీచర్ కైలాష్ చౌదరిని నడిరోడ్డుపై హత్య చేశారు దుండగులు. కోచింగ్ క్లాస్‌కు అటెండ్ అయి తిరిగి వస్తుండగా.. ఈ దారుణం జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. సోదరుడితో నడుస్తున్న ఆమెపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కైలాష్ అక్కడికక్కడే మరణించగా.. ఈ ఘటన చూసిన సోదరుడు షాక్‌లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. భూ వివాదం ఇందుకు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story