డాక్టర్‌పై ఎస్‌ఐ అత్యాచారం.. నాలుగు నెలలపాటు నరకం.. ఆత్మహత్య

by Sujitha Rachapalli |

మహారాష్ట్ర సతారా జిల్లాలో లేడీ డాక్టర్ ఆత్మహత్యతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఫాల్టాన్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ సంపద ముండే.. ఓ హోటల్‌లో ఉరేసుకుని చనిపోయింది. తన చేతిపై ఇందుకు కారణాన్ని రాసుకుంది.

డాక్టర్‌పై ఎస్‌ఐ అత్యాచారం.. నాలుగు నెలలపాటు నరకం.. ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర సతారా జిల్లాలో లేడీ డాక్టర్ ఆత్మహత్యతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఫాల్టాన్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ సంపద ముండే.. ఓ హోటల్‌లో ఉరేసుకుని చనిపోయింది. తన చేతిపై ఇందుకు కారణాన్ని రాసుకుంది. సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బద్నే నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని, మానసికంగా వేధిస్తున్నాడని చెప్పింది. మరో పోలీస్ ప్రశాంత్ బంకర్‌ వేధిస్తున్నట్లుగా తెలిపింది.

కాగా కొన్ని నెలలుగా పోలీసులకు, ఆరోగ్య శాఖకు మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్ష కేసు విషయంలో డాక్టర్ సంపదకు పోలీసులతో గొడవ జరిగింది. ఈ కేసు విషయంలో విచారణ ప్రారంభమైంది. అయితే తనకు ఈ విషయంలో అన్యాయం జరుగుతుందని ఉన్నతాధికరులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది డాక్టర్ సంపద. తాను ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొంది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం.. మానసిక ఒత్తిడితో విసిగిపోయిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Next Story