- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య
దిశ, దుబ్బాక : అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ పి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, దుబ్బాక : అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ పి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన డప్పు చంద్రం(50) గ్రామంలో కూలి పని చేస్తూ, కుటుంబంతో కలిసి, జీవనం కొనసాగిస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. ఇటీవల నాలుగు నెలల క్రితం చేసిన అప్పులు తీర్చేందుకు ఒక ఎకరం భూమిని అమ్మి, కొన్ని అప్పులు తీర్చాడు. మరికొన్ని అప్పులు మిగిలి ఉన్నాయి. దీంతో మిగిలిన అప్పుల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, తనలో తాను బాధపడేవాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని ఒక చెట్టుకు చంద్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జరిగిన ఘటన గుర్తించిన స్థానికులు పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, పంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






