కోహెడలో చైన్ స్నాచింగ్ కలకలం.. వృద్ధురాలిని మోసగించి గొలుసు చోరీ

by Bhanu |   (  Updated:2025-07-08 16:30:48  IST  )

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్క యాంజాల్ మున్సిపాలిటీలోని కోహెడ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న

కోహెడలో చైన్ స్నాచింగ్ కలకలం.. వృద్ధురాలిని మోసగించి గొలుసు చోరీ
X

దిశ, వనస్థలిపురం: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్క యాంజాల్ మున్సిపాలిటీలోని కోహెడ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. పసుల నర్సమ్మ (65) అనే వృద్ధురాలు స్వగృహ కాలనీలోని తన మూడవ కుమారుడు శ్రీశైలం ఇంటి నుండి సమీపంలోని రెండవ కుమారుడు యాదగిరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అడ్డగించి ఇబ్రహీంపట్నంకు దారి ఏటని అడిగారు. వృద్ధురాలు రూట్ చెబుతుండగానే ఆమె మెడలో ఉన్న దాదాపు తులంన్నర బరువున్న బంగారు గుండ్లతాడు గొలుసును లాక్కొని నిందితులు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు.

వృద్ధురాలు బిగ్గరగా కేకలు వేసినప్పటికీ, ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి సహాయం అందలేదు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ, హయత్‌నగర్ సీఐ నాగరాజ్ గౌడ్, ఎస్సై వెంకట్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.


Next Story