- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్లలో కత్తిపోట్ల కలకలం
by Bhanu |
పట్టణంలోని రవీంద్ర రోడ్ ప్రాంతంలో ఇత్యాల సత్యనారాయణ అనే వ్యక్తిపై గంగ నర్సయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

X
దిశ, కోరుట్ల టౌన్: కోరుట్ల పట్టణంలో ఆదివారం ఉదయం కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. పట్టణంలోని రవీంద్ర రోడ్ ప్రాంతంలో ఇత్యాల సత్యనారాయణ అనే వ్యక్తిపై గంగ నర్సయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సత్యనారాయణకు కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
పాతకక్షలే ఈ హింసాత్మక ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన సత్యనారాయణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. కోరుట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో ఒకవేళ మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Next Story






