Kidnap: తెలంగాణలో మరో సంచలనం.. యువతి కిడ్నాప్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది

Kidnap: తెలంగాణలో మరో సంచలనం.. యువతి కిడ్నాప్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ (Medchal) జిల్లాలో ఓ యువతి కిడ్నాప్‌‌కు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అంకుషాపూర్ (Ankushapur) గ్రామానికి చెందిన యువతిని కొంతమంది దుండగులు వెంబడించి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్ 100 (Dial 100) ద్వారా పోలీసులకు సమాచారం అందజేశారు. ఫిర్యాదును స్వీకరించిన వారు కిడ్నాప్ చేసిన యువతిని హైదరాబాద్ (Hyderabad)-వరంగల్ (Warangal) హైవే (Highway)పై భువనగిరి (Bhongir) వైపు తీసుకెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సమీప బంధువులే యువతిని అపహరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు

Next Story