ఐబొమ్మ రవిది మొదటి నుంచీ క్రిమినల్ మెంటాలిటీ: పోలీసులు

by Gantepaka Srikanth |

ఐబొమ్మ రవి(ibomma Ravi) కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. రవిది మొదటి నుంచీ క్రిమినల్ మెంటాలిటీ అని నిర్ధారించారు.

ఐబొమ్మ రవిది మొదటి నుంచీ క్రిమినల్ మెంటాలిటీ: పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ రవి(ibomma Ravi) కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. రవిది మొదటి నుంచీ క్రిమినల్ మెంటాలిటీ అని నిర్ధారించారు. స్నేహితుడి గుర్తింపు కార్డులతో నేరాలకు పాల్పడ్డాడని గుర్తించారు. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించినట్లు తెలిపారు. భార్య, పిల్లలను చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. రవి ప్రవర్తననచ్చక భార్య విడాకులు ఇచ్చిందని పోలీసులు అంచనాకు వచ్చారు. పోస్టర్ డిజైన్ చేసినందుకు నిఖిల్‌కు.. ప్రతి నెల రూ.50 వేలు ఇచ్చేవాడని వెల్లడించారు. ఐబొమ్మ సైట్‌లో బెట్టింగ్‌ బగ్‌ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, సినీ పరిశ్రమను పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. దశాబ్దకాలంగా సినీ ఇండస్ట్రీకి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన పైరసీ అంతంపై స్పష్టత లేదు. తాజాగా అరెస్ట్ అయిన ఐ బొమ్మ నిర్వాహకుడి వద్ద 21 వేల సినిమాల డేటా ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన సినిమాల డేటా అతని వద్ద ఉందని చెబుతున్నారు. అయితే పైరసీ వెబ్‌సైట్‌ల నిర్వాహకులు మూడు పదుల వయస్సు గలవారే కావడం గమనార్హం. కొందరు ఇంటర్ చదివి హ్యాకింగ్ నేర్చుకుని సినిమాలను అన్‌లైన్ ద్వారా ప్రదర్శించే క్యూబ్, యూఎఫ్‌వో వంటి మీడియా హౌస్‌లను హ్యాక్ చేయడం చిత్ర పరిశ్రమను కలవరపెడుతున్నది. ప్రస్తుతం దీని మూలలను కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Next Story