- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ నటి ప్రత్యూష కేసులో సంచలనం.. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
సినీ నటి ప్రత్యూష కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి నాంపల్లి కోర్టులో సోమవారం లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి ప్రత్యూష కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి నాంపల్లి కోర్టులో సోమవారం లొంగిపోయారు. మార్చి 16వ తేదీలోపు లొంగిపోవాలని నాలుగు వారాల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగియడంతో ఇవాళ సిద్ధార్థ రెడ్డి లొంగిపోయారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత సిద్ధార్థ రెడ్డి మీడియా కెమెరాల ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లు అమెరికాలో నివాసం ఉన్నట్లు సమాచారం. 2002 ఫిబ్రవరి 23వ తేదీన కూల్ డ్రింక్‌లో పురుగులమందు కలుపుకొని ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ తాగారు. ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యూష పరిస్థితి విషమించి మృతిచెందింది. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. అయితే.. అప్పటినుంచి తన కూతురిది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ తల్లి న్యాయపోరాటం చేస్తూ వచ్చింది. సిద్ధార్థ రెడ్డే కారణమంటూ ఆరోపిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ రెడ్డే కారణమని ఇటీవల కోర్టు తేల్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని నాలుగు వారాల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ లొంగిపోయాడు. సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారైంది.






