- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karnataka rabinhood: దొంగల్లోనే మంచి దొంగ.. కోట్లు కొల్లగొట్టి సేవకార్యక్రమాలు
దొంగలు(Theft) అంటేనే చెడ్డవాళ్లు మళ్లీ అందులో మంచిదొంగలు కూడా ఉంటారా? అని అనుమానం రావచ్చు. కానీ ఈ దొంగ మాత్రం కొందరికి మంచివాడే.

దిశ, వెబ్ డెస్క్: దొంగలు(Theft) అంటేనే చెడ్డవాళ్లు మళ్లీ అందులో మంచిదొంగలు కూడా ఉంటారా? అని అనుమానం రావచ్చు. కానీ ఈ దొంగ మాత్రం కొందరికి మంచివాడే. కర్నాటకకు చెందిన శివప్రసాద్ అలియాస్ మంత్రిశంకర్(Mantri shankar) వృత్తిపరంగా గజదొంగ. 300లకు పైగా కేసులు ఉన్న శివ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. శివప్రసాద్(Shiva prasad) నుండి పోలీసులు దాదాపు రూ.30 లక్షల విలువైన 412 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అతడు కోట్ల రూపాయలు దోచుకున్నట్టు గుర్తించారు.
అంతే కాకుండా శివప్రసాద్ తాను దోచుకున్న డబ్బుల్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ముఖ్యంగా తాళం వేసిన కోటీశ్వరుల ఇళ్లనే శివప్రసాద్ టార్గెట్ చేసి దొంగతనాలు చేసినట్టు విచారణ తేలింది. అసలు ఆధారాలు దొరకకుండా, వేలి ముద్రలు పడకుండా చేతి వేళ్లకు ఫెవికాల్ పూసుకుని చోరీలు చేయడం శివప్రసాద్ స్టైల్ అని పోలీసులు చెబుతున్నారు. తాను దోచుకున్న డబ్బును సేవా కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించడం వెనుక కూడా ఓ కారణం ఉందట.
సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుందని ఆయన విశ్వసిస్తారట. శివప్రసాద్ మహారాష్ట్రలోని ఓ ప్రముఖ ఆలయ నిర్మాణానికి సైతం రూ.5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అదే విధంగా పలు దేవాళయాలకు బంగారం కానుకగా ఇవ్వడం, పేదలకు ఆస్పత్రి ఖర్చులు ఇవ్వడం, అన్నధాన కార్యక్రమాలు చేస్తూ పేదలు కడపునింపడం ఇలా చెప్పుకుంటూ పోతే శివప్రసాద్ చేసే సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. ఇక శివ ప్రసాద్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడంతో ఆయనను నెటిజన్లు కర్నాటక రాబిన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.






