1.5 కేజీల డ్రై గంజా స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

by Bhanu |

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

1.5 కేజీల డ్రై గంజా స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
X

దిశ, జూబ్లీహిల్స్: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెల్లాపూర్, రామచంద్రాపురంకి చెందిన పెదురుపాడు సురేష్ (19), ఆంధ్రప్రదేశ్, రంగపాడుకి చెందిన ఎం.వరుణ్ కుమార్ (21) తెల్లాపూర్ లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద పనిచేస్తారు. ఈ ఇద్దరు కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 , టైగర్ లిల్లీ కేఫ్ సమీప ప్రాంతంలో గురువారం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో అక్రమంగా డ్రై గాంజా రవాణా చేసి విక్రయిస్తున్నారు.


విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్ ఎక్సైజ్ అధికారులు , హైదరాబాద్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు కలిసి సంఘటన స్థలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1.5 కేజీల డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని, హోండా యాక్టివా బైక్, రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి, నిందితులను రిమాండ్ కి తరలించినట్లు జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ఎస్ ఐ బ్రహ్మచారి తెలిపారు.

Next Story