మైనర్‌పై జర్నలిస్ట్, సబ్ ఇన్‌స్పెక్టర్ దారుణం.. SUVలో రెండుగంటల పాటు లైంగికదాడి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-08 04:32:48  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న ఎస్‌యూవీలో జర్నలిస్ట్, ఒక ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డారు.

మైనర్‌పై జర్నలిస్ట్, సబ్ ఇన్‌స్పెక్టర్ దారుణం.. SUVలో రెండుగంటల పాటు లైంగికదాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న ఎస్‌యూవీలో యూట్యూబర్, జర్నలిస్ట్ శివభరణ్, ఒక ఎస్ఐ అత్యాచారం చేసిన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన క్రమంగా.. నిందితుడికి సహకరించిన భీమ్ సేన్ అవుట్ పోస్ట్ ఇన్ చార్జ్ ఎస్ఐ అంకిత్ మౌర్యను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు శివభరణ్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సరైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయని కారణంగా సచేండి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ విక్రమ్ సింగ్ ను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ తెలిపారు.

నిర్మానుష్య ప్రదేశంలో రెండుగంటలపాటు లైంగికదాడి

బాధితురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల తన సోదరి 7వ తరగతి చదివి మానేసింది. సచేండి రైల్వే స్టేషన్ సమయంలో మంగళవారం రాత్రి 9-10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి రాగా.. ఎస్ యూవీలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. బాలిక సోదరుడు చూసిన ఇద్దరిలో ఒకరు పోలీస్ యూనిఫాంతో కనిపించారు. బాలికను రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. దాదాపు రెండుగంటల పాటు వాహనంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్థరాత్రి అపస్మారక స్థితిలో బాలికను ఇంటిముందు వదిలి వెళ్లారు. వెంటనే 112కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన తక్షణ చర్యలు తీసుకోలేదని బాలిక సోదరుడు వెల్లడించాడు. నిందితుల్లో ఒకరు పోలీస్ అని చెప్పడంతోనే పోలీసులు వెంటనే స్పందించలేదని వాపోయాడు. ఈ ఘటనపై మరుసటి రోజు సీనియర్ అధికారులను సంప్రదించడంతో.. కిడ్నాప్, గ్యాంగ్ రే*ప్, పోక్సోకు సంబంధించిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపాడు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు చేశామని, రిపోర్ట్ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం జర్నలిస్ట్ శివభరణ్ ను విచారణ చేస్తున్నామని, ఈ నేరంతో సంబంధం ఉన్న పోలీస్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని త్రిపాఠి పేర్కొన్నారు.

Read More..

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్

Next Story