- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ తీగలు తగిలి JCB డ్రైవర్ సజీవ దహనం
by Ramesh Naini |
జేసీబీతో పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో జేసీబీ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో శుక్రవారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జేసీబీతో పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో జేసీబీ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరాజుగా పోలీసులు గుర్తించారు. సంఘటన సమయంలో జేసీబీ బకెట్ హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో ఒక్కసారిగా భారీ స్పార్క్ ఏర్పడి, డ్రైవర్‌కు తీవ్రంగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో జేసీబీ క్యాబిన్‌లోనే సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






