- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను గాయపరిచిన ఇద్దరికి జైలు
by Sridhar Babu |
కర్రలతో దాడి చేసి ఓ మహిళను గాయపరిచిన కేసులో సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ ఇద్దరికి సంవత్సరంన్నర జైలుశిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

X
దిశ,సుల్తానాబాద్ : కర్రలతో దాడి చేసి ఓ మహిళను గాయపరిచిన కేసులో సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ ఇద్దరికి సంవత్సరంన్నర జైలుశిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే నవంబర్ 11, 2018 లో నిందితులు టపాసులు కాలుస్తూ తన ఇంటి కాంపౌండ్ లో వేసి కర్రలతో దాడి చేసి తలకు బలమైన గాయం చేసినట్లు ఓ మహిళ అప్పట్లో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దాంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణ అనంతరం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి శాస్త్రినగర్ కు చెందిన కల్వల లక్ష్మయ్య, కల్వల వినీష్ లకు సంవత్సరంన్నర జైలు శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి దుర్గం గణేష్ తీర్పు ఇచ్చారు.
- Tags
- Jail
Next Story






