- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలిపై అల్లుడు కత్తితో దాడి
జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ వృద్ధురాలిపై కత్తితో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ వృద్ధురాలిపై కత్తితో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం, చలిగల్‌కు చెందిన కల్లెడ కమల అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తూ ఉంది. ఆమె చెల్లెలి కుమార్తె సువర్ణ వివాహం ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన హరీష్‌తో జరిగింది.
వివాహానంతరం కొంతకాలం బాగానే ఉన్నా, హరీష్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవలు పెట్టుకుంటుండేవాడు. దాంతో సువర్ణ నాలుగు నెలల క్రితం తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె తిరిగి కాపురానికి రాకపోవడం పట్ల కోపంతో ఉన్న హరీష్, దీనికి కారణం పెద్ద అత్త కమలేనని భావించాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి, కమలపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన వృద్ధురాలిని స్థానికులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని చూసి ఆందోళనకు గురైన గ్రామస్తులు ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






