బంగారం కొనుగోళ్ళపై కొనసాగుతున్న ఐటీశాఖ సోదాలు

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లో బంగారం కొనుగోలు కేంద్రాలపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా బంజారా హిల్స్ ప్రాంతంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.

IT Rides In Power Make Corporate Office
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో బంగారం కొనుగోలు కేంద్రాలపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా బంజారా హిల్స్ ప్రాంతంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున క్యాప్స్ గోల్డ్ కంపెనీ బంగారం కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దాని అనుబంధ సంస్థలపైనా సోదాలు చేపట్టారు. బంగారం కోనుగోళ్లతో వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ సంస్ధలలో పెట్టుబడులకు తరలించారని ఐటీ శాఖ గుర్తించింది. దీంతో వాసవీ రియల్ ఎస్టేట్ సంస్ధ పై ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బంజారా హిల్స్ కార్యాలయంలో తనీఖీలు చెపట్టి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story