- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో ఐటీ దాడుల కలకలం.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పిస్తా హౌస్, షా గౌస్, మేహిఫిల్ హోటల్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఇవాళ వుడ్ బ్రిడ్జ్ హోటల్ (Wood Bridge Hotel) యజమాని ఇంట్లో సోదాలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆ హోటల్ ఓనర్ హర్షద్ అలీ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని, గతంలో ఐటీ దాడులు జరిగిన పిస్తా హౌస్, ఇతర హోటళ్లు, రెస్టారెంట్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల నవంబర్ 18న హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలో కూడా ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే షా గౌస్, పిస్తా హౌస్, మెహఫిల్ వంటి రెస్టారెంట్ల యజమానుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఆ దాడుల్లో ఐటీ అధికారులు భారీ మొత్తంలో లెక్కలో లేని నగదును గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో జరుగుతున్న సోదాలు ఆ దాడుల్లో భాగమేనని తెలుస్తోంది. బ్లాక్ మనీతో పాటు ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడిన వారిపై ఐటీ శాఖ తమ దృష్టిని కేంద్రీకరించింది. ఈ సోదాల్లో ఇంకా ఎంత నగదు లేదా అక్రమ ఆస్తులు లభించాయనే వివరాలు ఐటీ అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.






