ముగిసిన మధ్యంతర బెయిల్ గడువు.. మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

by Kema Shiva Kumar |

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది.

ముగిసిన మధ్యంతర బెయిల్ గడువు.. మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్
X

దిశ, వెబ్‌డెస్క్: పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ (Bandi Bhagirath)ను పోలీసులు మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో పోలీసులు గురువారం అర్థరాత్రి అతడిని తిరిగి కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే, గతంలో నమోదైన పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, తాను ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్నానని, పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి భవిష్యత్తును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పరీక్షలు రాసేందుకు ఈ నెల 20న అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, కోర్టు విధించిన నిబంధనల ప్రకారం నిన్నటితో భగీరథ్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అనంతరం భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.

Next Story