- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: ప్రభాకర్ రావు చెప్పిన పేర్లెవరివి?.. అప్పటి పోలీసు బాస్‌లో కలవరం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్ రావు ఎంక్వయిరీపై పోలీసు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.

దిశ, సిటీక్రైం: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్ రావు ఎంక్వయిరీపై పోలీసు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. 15 నెలల తర్వాత ఇండియాకు వచ్చిన ప్రభాకర్ రావు.. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన ఎంక్వయిరీలో ఏం చెప్పారు? ఎవరెవరి పేర్లు తీశారు? అని పోలీసుల్లో డిస్కషన్ జరిగినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు వ్యవహారం అప్పటి పోలీసు బాస్‌లో కలవరం రేపే విధంగా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కోసం అనుసరించాల్సిన నిబంధనలతో ప్రభాకర్ రావు అందరి పేర్లను ఈ కేసులో లాగుతారని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎంత నిబంధనలను ఉల్లంఘించినా.. తాను ఒక్కడిని మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడలేననే విషయాన్ని విచారణలో ప్రభాకర్ రావు చెప్పనున్నట్లు సమాచారం. ఇలా ఫోన్ ట్యాపింగ్ అనుమతి ప్రక్రియ, దానికి సంబంధించిన విధి విధానాలను బట్టి అప్పటి పోలీసు బాసులకు ఫోన్ ట్యాపింగ్ విషయం తెలిసి ఉంటుందనే విషయాన్ని వెలుగులోకి తీసుకువరావడానికి ప్రభాకర్ రావు ప్రయత్నం చేస్తారని కూడా టాక్ ఉంది.
అనుమతి ప్రక్రియ ఇలా..
ఎస్ఐబీ ఒక అనుమానితుడి ఫోన్ ట్యాప్ చేయాలంటే కేసు దర్యాప్తు చేస్తున్న ఐఓ (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) ఆ అనుమానితుడి వివరాలు, కేసు విషయాన్ని తనపై అధికారికి తెలియజేయాలి. ఆ అధికారి ఈ విషయాన్ని తనపై అధికారి లేదా ఎస్పీ ముందు నోట్ రూపంలో పెట్టాలి. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐబీ చీఫ్ వద్దకు నోట్ చేరుతుంది. అతను పరిశీలించిన తర్వాతే అనుమానితుడి ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గరకు వస్తుంది. అక్కడ చీఫ్ సంతకం అయిన తర్వాత ఆ ఫైల్ టెలికామ్ డిపార్ట్ మెంట్ కు వెళ్తుంది. అప్పుడు టెలికామ్ డిపార్ట్ మెంట్ అధికారులు ఏడు రోజుల వరకు ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇస్తారు. ఏడు రోజుల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశాలు, కేసు విషయంతో కూడిన వివరాలను సెక్యూరిటీ రివ్యూ కమిటీకి పంపుతారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీలో ఉండే హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లకు ఏడు రోజుల ఫోన్ ట్యాపింగ్ విషయంతోపాటు కేసు అంశాలను నివేదిక రూపంలో సమర్పిస్తారు.
ఏడు కంటే ఎక్కువ రోజులు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. వారు అనుమతిస్తేనే ఏడు రోజులకు మించి ఫోన్ ట్యాప్ చేయడానికి అనుమతి లభిస్తుంది. ఈ ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ కు పక్కా కావడంతో ప్రభాకర్ రావు ఈ విషయం పై పట్టుబట్టి తనకు అనుమతి ఇచ్చిన అధికారులందరినీ విచారించాలనే డిమాండ్ తీసుకువచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ ప్రక్రియకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదని తనను విచారిస్తున్న పోలీసు అధికారులకు ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వస్తున్న ఆరోపణల్లో వీరందరీకి కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందనే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రభాకర్ రావు స్కెచ్ వేసుకొని ఉంటారని టాక్.






