దారుణం.. ప్రేమించలేదని ఇంటర్ విద్యార్థిని హత్య

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-20 07:05:54  IST  )

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తిరిగి ప్రేమించడంలేదని ప్రేమోన్మోది ఇంటర్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన రమనాథపురం జిల్లా రామేశ్వరం సమీపంలోని సెరాంకొట్టైకి చెందిన మారియప్పన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

దారుణం.. ప్రేమించలేదని ఇంటర్ విద్యార్థిని హత్య
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తిరిగి ప్రేమించడంలేదని ప్రేమోన్మోది ఇంటర్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన రమనాథపురం జిల్లా రామేశ్వరం సమీపంలోని సెరాంకొట్టైకి చెందిన మారియప్పన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె షాలిని రామేశ్వరం బాలికల కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కాగా స్థానికంగా ఉండే మునిరాజ్ అేనే వ్యక్తి తనను ప్రేమించాలి అంటూ బాలిక వెంటపడటం ప్రారంభిచాడు. దీంతో బాలిక తన తండ్రికి ఫిర్యాదు చేయగా మునిరాజ్ ను మారియప్పన్ మందలిచాడు. పలుమార్లు చెప్పినా వినకపోగా వేధింపులు ఎక్కువ చేశాడు. ఈ క్రమంలో బుధవారం కాలేజీకి వెళుతున్న షాలినిని ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. వినకపోవడంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో పొడిచేశాడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది.

Next Story