రైలు కింద పడి ఇంటర్ విద్యార్థి దుర్మరణం

by Mallepaka Hamsa |

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రైలు కింద పడి ఇంటర్ విద్యార్థి దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం గ్రామానికి చెందిన బలక తరుణ్‌ టెక్కలి గవర్న‌మెంట్ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతున్నాడు.

అయితే బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. మొత్తం అన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్‌ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెంది గురువారం ఉదయం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదురుగా ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Next Story