- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్స్టాలో అమ్మాయి.. బయట అబ్బాయి.!
ఇన్స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి పేరుతో పరిచయం పెంచుకున్న యువకుడు, చివరికి తనే బ్రదర్ అంటూ మళ్లీ మోడల్ మార్చి, కొంతమందిని

దిశ, భైంసా: ఇన్స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి పేరుతో పరిచయం పెంచుకున్న యువకుడు, చివరికి తనే బ్రదర్ అంటూ మళ్లీ మోడల్ మార్చి, కొంతమందిని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి లక్షలు వసూలు చేసిన సంఘటన ముధోల్ మండలం విట్టోలి తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్‌కి చెందిన బనావత్ గణేశ్ అనే యువకుడు, ముధోల్ మండలంలోని విట్టోలి తండాకు చెందిన రాథోడ్ మహేందర్ అనే యువకుడిని ఇన్స్టాలో "అమ్మాయి"లా నటిస్తూ పరిచయమయ్యాడు. "ఉద్యోగం ఉంటేనే పెళ్లి, నీకు నేను సెట్!" అంటూ ప్రేమగా మాయజాలం నేసాడు. తర్వాత "నా అన్నయ్య ఉద్యోగం ఇప్పిస్తాడు" అంటూ మరొక క్యారెక్టర్ లోకి మారిపోయాడు.
ఆ అన్నయ్యగా కనిపించిన వ్యక్తి కూడా గణేశ్‌యే కావడం గమనార్హం! హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహేందర్‌తో పాటు అతని బంధువు ఉమేశ్ నుండి 20 వేలు వసూలు చేశాడు. ఇంకా దాంతో పాటు విట్టోలి తండాలోని ఇతర గ్రామస్తుల నుండి కూడా ఈ నాటకంతో దాదాపు 15 మంది వద్ద డబ్బులు వసూలు చేశాడు. మరిన్ని వాగ్దానాలతో కొంతమందిని హైదరాబాద్‌కి తీసుకెళ్లి ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంచి అదృశ్యమైన గణేశ్.. చివరికి తిరిగి రాకపోవడంతో బాధితులు స్వగ్రామానికి చేరుకుని ముధోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటర్నెట్‌లో ప్రేమ పేరుతో మోసం చేసే నకిలీ క్యారెక్టర్లు, డబ్బు మాయలు ఇప్పుడు సాధారణమైపోతున్నాయని, పోలీసులు హెచ్చరిస్తున్నారు.






