12 ప్రత్యేక బృందాలతో తనిఖీలు : ఈగిల్ టీమ్

by Muthe.Rajitha |

తెలంగాణలో డ్రగ్స్‌ను కట్టడి చేయడానికి ఈగల్ ఫోర్స్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) మరిన్ని గట్టి చర్యలు తీసుకుంటోంది.

12 ప్రత్యేక బృందాలతో తనిఖీలు : ఈగిల్ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో డ్రగ్స్‌ను కట్టడి చేయడానికి ఈగల్ ఫోర్స్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) మరిన్ని గట్టి చర్యలు తీసుకుంటోంది. నూతన సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరిగేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. నగరంలోని పబ్‌లు, హోటల్స్, ఈవెంట్ వేదికలపై అకస్మాత్తు తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలు పాటించని పబ్‌లకు నోటీసులు జారీ చేస్తున్నారు.

డిసెంబర్ 28న కొండాపూర్‌లోని క్వేక్ అరేనా పబ్‌లో దాడులు చేయగా, డీజే కార్యక్రమంలో పాల్గొన్న 8 మందికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. వారిపై కేసులు నమోదు చేసి, పబ్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ‘జీరో డ్రగ్స్’ విధానం అమలు చేస్తున్నామని, డ్రగ్స్ దొరికితే పబ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కఠిన చర్యల వల్ల డ్రగ్స్ సరఫరా, వినియోగం గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు.

Next Story