అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

by Chintha Aamani |   (  Updated:2025-08-14 12:30:50  IST  )

మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల కన్న కూతురిపై తండ్రి గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం
X

దిశ, నవీపేట్: మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల కన్న కూతురిపై తండ్రి గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 11 సంవత్సరాల వయసు గల తన కూతురిపై కన్న తండ్రి గత కొంతకాలంగా అసభ్యకర వీడియోలు చూయిస్తూ శృంగారంపై ఉత్తేజం కలిగే విధంగా ప్రయత్నించే వాడు. వారం రోజుల క్రితం ఆ బాలికపై తన తండ్రి అత్యాచారం చేసేందుకు ఒత్తిడి చేశాడు. బాలిక తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తనను వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని తండ్రిని చూస్తే భయమేస్తుందని ఏడుస్తూ బతిమిలాడింది.

అప్పుడు ఏమైందని తల్లి కూతురిని అడగగా అసలు విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు బంధువులకు తెలపగా వారు సముదాయించి వెళ్లిపోయారని బాధితురాలి తల్లి తెలిపింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియగా గ్రామ పంచాయతీ వద్ద గుమిగూడి చర్చించడంతో విషయం బయటపడింది. దీంతో బాలిక తండ్రి పరారీలో ఉన్నాడు. బాధితురాలి తల్లి తన బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.

Also Read..

దారుణం.. 14ఏళ్ల బాలికపై 200 మంది అత్యాచారం

Next Story