ఏసీబీ సోదాల సమాచారం లీక్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి‌పై సస్పెన్షన్ వేటు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-17 08:03:18  IST  )

పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఏసీబీ సోదాల సమాచారం లీక్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి‌పై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డె‌స్క్: పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ (HCA) అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ రెడ్డి హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌కు సహకరించినట్లుగా శాఖాపరమైన విచారణలో వెల్లడైందని వారు పేర్కొన్నారు.అయితే, మరోవైపు HCA జనరల్‌ సెక్రటరీ దేవరాజు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసిన CID రంగం సిద్ధం చేస్తోంది.

కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి..

తెలంగాణలోని హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (Hyderabad Cricket Association) తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. HCA, SRH వివాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు (Jaganmohan Rao) శ్రీచ‌క్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ విచారణలో తేలింది. న‌కిలీ ప‌త్రాల‌తో ఏర్పాటు చేసిన క్లబ్ ద్వారానే HCAలో అధ్యక్షుడిగా పోటీ చేసిన‌ట్టు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే గతంలో హెచ్‌సీఏ వివిధ కాంట్రక్టర్లు, వర్కర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పలువుకు కోర్టును ఆశ్రయించగా.. వెంటనే చెల్లించాలని ఆదేశించింది.

అయితే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం హై కోర్డు (High Court) ఆదేశాలను పట్టించుకోకుండు.. ఎవరికి డబ్బులు చెల్లించలేదు. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ హైకోర్టు HCA అధికారుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకపోవడం పై HCA అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి డబ్బులు ఎందుకు చెల్లించడం లేదో నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్, సీఈవో సునీల్‌ బోస్‌న హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణ 18కి వాయిదా వేసింది.

Next Story