- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. 15రోజుల శిశువు నోట్లో రాయి కుక్కి.. ఏడుపు వినబడకుండా ప్లాస్టర్ వేసి.. రాళ్ల కింద పాతిపెట్టి.. ఆ తర్వాత
రాజస్థాన్ భీల్వారా జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మండల్‌గఢ్‌లోని సీతా కా కుండ్ ఆలయం సమీపంలో పదిహేను రోజుల శిశువును రాళ్ల కింద పాతి పెట్టారు. బాలుడి నోటిలో రాయి కుక్కి.. ఏడుపు వినబడకుండా ఫేవిక్విక్, ప్లాస్టర్‌తో నోటిని మూసి

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ భీల్వారా జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మండల్‌గఢ్‌లోని సీతా కా కుండ్ ఆలయం సమీపంలో పదిహేను రోజుల శిశువును రాళ్ల కింద పాతి పెట్టారు. బాలుడి నోటిలో రాయి కుక్కి.. ఏడుపు వినబడకుండా ఫేవిక్విక్, ప్లాస్టర్‌తో నోటిని మూసి రాళ్ల కింద వదిలివెళ్లారు. తొడలపై కూడా కాల్చిన గాయాలుండగా.. ఎర్రగా బొబ్బలు వచ్చాయి. నోటి చుట్టూ గాయాలున్నాయి.
అయితే ఓ గొర్ల కాపరి అటువైపుగా వెళ్లగా.. శిశువు ఏడుపు విని.. స్థానికులకు విషయాన్ని వివరించి.. వారి సహకారంతో బయటకు తీశాడు. ఆ తర్వాత బీజోలియాలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. పూర్తిగా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసిన భీల్వారా పోలీసులు.. ఆస్పత్రి రికార్డుల ఆధారంగా గ్రామాల్లో విచారణ ప్రారంభించారు. శిశువు తల్లిదండ్రులను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.






