కెనడాలోని టోరంటోలో ఘోరం.. భారత విద్యార్థిని దారుణ హత్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-26 02:27:13  IST  )

భారత విద్యార్థిని దారణ హత్యకు గురైన విషాద ఘటన కేనడా దేశంలో చోటుచేసుకుంది.

కెనడాలోని టోరంటోలో ఘోరం.. భారత విద్యార్థిని దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: భారత విద్యార్థిని దారణ హత్యకు గురైన విషాద ఘటన కేనడా (Canada) దేశంలో చోటుచేసుకుంది. టొరంటోలోని స్కార్‌బొరౌగ్‌ (Scarborough) విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్‌ అవస్థి (Shivank Awasthi)ని దుండగులు కాల్చి చంపారు. స్థానిక హైల్యాండ్‌ క్రీక్‌ ట్రెయిల్‌ (Highland Creek Trail) వద్ద ఈ ఘటన జరిగింది. అయితే, పోలీసులు స్పాట్‌కు వచ్చేలోపే నిందితులు పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసున మోదు చేసుకుందని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాల్పున నేపథ్యంలో స్కార్‌బొరౌగ్‌ క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. తాజాగా ఇదే ఘటనపై భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందజేస్తామని భరోసానిచ్చింది.

Next Story